ETV Bharat / jagte-raho

సెల్​ఫోన్​ల భారీ చోరీలో దర్యాప్తు ముమ్మరం - adilabad news

అలస్యంగా వెలుగులోకి వచ్చిన రూ.2 కోట్ల విలువైన చరవాణుల చోరి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పాడి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్​ డ్రైవర్లు ఇచ్చిన సమాచారాన్ని లెక్కలోకి తీసుకుని విచారణ చేపట్టారు.

భారీ చోరీ: సెల్​ఫోన్​ కంటైనర్​ నుంచి 2 కోట్ల సరుకు మాయం

author img

By

Published : Sep 24, 2020, 11:54 AM IST

భారీ చోరీ: సెల్​ఫోన్​ కంటైనర్​ నుంచి 2 కోట్ల సరుకు మాయం
భారీ చోరీ: సెల్​ఫోన్​ కంటైనర్​ నుంచి 2 కోట్ల సరుకు మాయం

మెదక్​ జిల్లాలో వెల్దుర్తి మండలం మసాయిపేట వద్ద జరిగిన సెల్​ఫోన్ల భారీ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చెన్నై నుంచి దిల్లీకి బయలు దేరిన కంటైనర్​ మెదక్​ మీదుగా ప్రయాణించి మసాయిపేట సమీపంలోని ఓ దాబా వద్ద ఆగింది. డ్రైవర్లు భోజనం చేసి... అక్కడి నుంచి సుమారు 300 కిలోమీటర్ల తర్వాత ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడకు చేరుకున్నారు. అనుమానం వచ్చి పరిశీలించగా... చోరీ విషయం బయటపడిందని బాధితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

డ్రైవర్లు భోజనం కోసం ఆగినప్పుడే చోరీ జరిగిందా... లేక ఇంకా ఎక్కడైనా ఆపినప్పుడు జరిగిందా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్​ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో... డీఎస్పీ కృష్ణమూర్తి సూచనల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. దొంగల గాలింపును ముమ్మరం చేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: అధికారులు సహకరించటం లేదని సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.