అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్‌ను హైదరాబాద్ సీసీస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట ఏకారం గ్రామానికి చెందిన టేకుల ఫనిందర్ రెడ్డి.. హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాల్ సెంటర్ అమ్మాయిలతో ఫొటోలు దిగి వాటిని మార్ఫింగ్ చేశాడు. ఆ మార్ఫింగ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడు.
బాధిత యువతి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: 'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చేశారు'