ETV Bharat / jagte-raho

ఓయ్.. దొంగ సీసీ కెమెరాకు చిక్కాడోయ్!

"ఓయ్" పట్టించింది. అదీ సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా..! ఇంతకీ ఏంటా ఓయ్​..? దేన్ని పట్టించింది..? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి..!

cc caught the thieves
ఓయ్..! సీసీ కెమెరా పట్టించింది
author img

By

Published : Dec 22, 2020, 9:03 PM IST

సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా ట్రాక్టర్లలోని బ్యాటరీ, డీజిల్ దొంగిలించిన నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం రోజున పెంచికల్​పేట గ్రామానికి సంబంధించిన రైతుల ట్రాక్టర్లలోని బ్యాటరీ, డీజిల్, టేపిరికార్డర్స్​​ని దుండగులు దొంగిలించారు. గమనించిన రైతులు కమాన్పూర్ పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి దగ్గరలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆ ప్రాతంలో ఒక ఆటో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది. దాని వెనుక భాగంలో “ఓయ్” అనే పదం ఉంది. దాని ఆధారంగా విచారించిన పోలీసులు.. నిందితున్ని పట్టుకున్నారు. ఎందుకోసం ఆ పేరు పెట్టుకున్నాడో తెలియదు గాని.. ఓయ్​ అని పిలిచిమరీ ఆటో యజమానిని పోలీసులకు పట్టించింది.

ఇదీ చూడండి: 'పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.