ETV Bharat / jagte-raho

పలు క్రైమ్​ కేసుల్లో కీలకంగా మారిన నిఘా నేత్రలు

జంటనగరాల్లో రహదారి ప్రమాదాల నిర్ధరణలో నిఘానేత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న భారీ ప్రమాదాల కారణాలను గుర్తించి దోషులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలను ప్రధానంగా వినియోగిస్తున్నారు. ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగినప్పుడు అసలు ఏం జరిగింది, తప్పెవరిది తెలుసుకునేందుకు నిఘా నేత్రాల్లో నమోదైన దృశ్యాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

author img

By

Published : Dec 18, 2020, 7:57 PM IST

cc camera footage key rolu in crime case investigation in telangana
పలు క్రైమ్​ కేసుల్లో కీలకంగా మారిన నిఘా నేత్రలు

ఒక్క నిఘా నేత్రం వంద మంది పోలీసులతో సమానమంటూ... ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. పోలీసుల నుంచి కొందరు కళ్లుకప్పి తప్పించుకుంటున్నా నిఘానేత్రాలకు అడ్డంగా దొరికిపోతున్నారు. రహదారి ప్రమాదాల్లో సీసీ కెమెరాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు.. అందుకు కారణమైన వారిని గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడతున్నాయి. రహదారి ప్రమాదాలకు కారణమైన వారు ఒక్కోసారి తప్పించుకునేందుకు.. తమ తప్పు లేదంటూ బుకాయిస్తున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న ఘటనల్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.

సిగ్నల్​ జంపే కారణం

ఇలాంటి కేసుల్లో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి.. అసలు దోషులెవరో తేలుస్తున్నారు. ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గచ్చిబౌలి విప్రో చౌరస్తా వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో కారు, టిప్పర్‌ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని అంతా భావించారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా.. కారులో ప్రయాణిస్తున్న యువకులు ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడినా... ఆపకుండా కుడివైపునకు తిప్పారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌.. కారును ఢీకొని ఐదుగురు మృతిచెందారని పోలీసులు నిగ్గు తేల్చారు.

పక్కా ఆధారాలతో నిందితులకు శిక్ష

మేడ్చల్‌ రహదారి సుచిత్ర కూడలి వద్ద జరిగిన మరో ఘటనలో ఆటో ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే విషయం తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా పాదచారి మద్యం మత్తులో నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతూ.. ఆటోకు అడ్డుగా వచ్చినట్లు తేలింది. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆటో బోల్తా పడి ప్రయాణికుడు మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా ఆటో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. ఆటోను దాటే సమయంలో ఒక్కసారిగా వేగంగా కుడివైపునకు తిప్పటంతో.. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆటోడ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయటంతో ఘటన జరిగినట్లు నిర్ధరించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉపయోగించి.. పోలీసులు పలు కేసులను చేధించటంతో పాటు పక్కా ఆధారాలతో నిందితులకు శిక్షపడేలా చేస్తున్నారు.

ఇదీ చదవండి: పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.