ETV Bharat / jagte-raho

శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు - సీబీఐ వార్తలు

బ్యాంకును మోసం చేసి 51 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదయింది. కంపెనీ ఎండీ తోట కన్నారావు, డైరెక్టర్లు తోట వెంకట రమణ, తోట సురేంద్రపై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసి.. సోదాలు నిర్వహించింది.

Cbi Case
Cbi Case
author img

By

Published : Aug 26, 2020, 9:55 PM IST

శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదయింది. బ్యాంకును మోసం చేసి 51 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై కంపెనీ ఎండీ తోట కన్నారావు, డైరెక్టర్లు తోట వెంకట రమణ, తోట సురేంద్రపై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసి.. సోదాలు నిర్వహించింది.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్ సంస్థ పేరిట తోట కన్నారావు, వెంకట రమణ, సురేంద్ర... హైదరాబాద్​లోని ఐడీబీఐ బ్యాంకు నుంచి 2009లో 51 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణం చెల్లించలేదు. అయితే రుణం కోసం తప్పుడు ఆడిట్ నివేదికలు సమర్పించి మోసం చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఐడీబీఐ హైదరాబాద్ మేనేజర్ మల్లిఖార్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది. కంపెనీతో పాటు.. రాజమండ్రిలో సంస్థ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది.

ఇవీచూడండి: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.