సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. సీనియర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ భరత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు చేశారు. ఇర్ఫాన్ అనే కార్మికుడు పీఎఫ్ నగదు ఉపసంహరించుకునేందుకు భరత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
అర్ధరాత్రి ఒంటిగంట వరకు సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు... భరత్ రెడ్డిని వెంట తీసుకెళ్లారు. సోదాలకు సంబంధించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
ఇదీ చదవండి : తెలంగాణలో ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం