మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఖాతాదారుల వద్ద సేకరించిన డిపాజిట్ నగదులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జడ్చర్లలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో కొన్ని సంవత్సరాలుగాా బ్యాంకు అధికారులు ప్రైవేట్ ఏజెంట్‌ను పెట్టి ఖాతాదారుల వద్ద డిపాజిట్ డబ్బులు జమ చేశారు. దాదాపు రూ.50 లక్షల వరకు 160 మంది ఖాతాదారుల వద్ద నగదు జమ చేసి, వాటి కాలపరిమితి పూర్తైనా చెల్లింపులు చేయలేదు.
చెల్లింపుల్లో జాప్యం చేయడం వల్ల ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. డబ్బుల్లో అవకతవకలు జరిగాయని గుర్తించిన ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు సీఈఓ కుబేరుడు, మేనేజర్ ప్రభాకర్, ఏజెంట్ జహంగీర్‌పై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.