ETV Bharat / jagte-raho

'యువత చెడు మార్గంలో పయనించకుండా ఉండేందుకే నిర్బంధ తనిఖీలు' - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

మహబూబాబాద్​ జిల్లా ఆమనగల్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని పలు వాహనాలు, అక్రమ మద్యం సీసాలు, గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.

cardon search at amangal in mahabubabad district
'యువత చెడు మార్గంలో పయనించకుండా ఉండేందుకే నిర్బంధ తనిఖీలు'
author img

By

Published : Oct 27, 2020, 11:44 PM IST

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ మండలం ఆమనగల్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్​ రూరల్​ సీఐ వెంకటరత్నం ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొని.. సరైన అనుమతి పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, రూ. లక్ష విలువైన మద్యం సీసాలు, 10 లీటర్ల గుడుంబా, 10 కేజీల పటిక, 30 లీటర్ల పెట్రోల్, 2 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.

గ్రామీణ యువత చెడు మార్గంలో పయనించకుండా, వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ వెంకటరత్నం పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనించాలని సూచించారు. కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.