ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లె వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో.. ప్రతాప్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. గురువారం అర్ధరాత్రి కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహానికి హాజరై తిరిగివస్తుండగా.. కొండయ్యగారి పల్లె వాగు ఉద్ధృతంగా ప్రవహించటంతో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది.
ఈ ఘటనలో ప్రతాప్, అతని కుమార్తె సాయివినీతలు గల్లంతయ్యారు. వినీత మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తించారు. నేడు ప్రతాప్ మృతదేహాన్ని వెలికితీశారు. తండ్రీకుమార్తె మరణంతో వారి స్వగ్రామమైన వడ్డారపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి..