రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్గురోడ్డుపై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులుకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్ నగర్ నుంచి నల్గొండ వెళ్తున్న కార పెద్దగోల్కొండ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని భోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన బీటెక్ విద్యార్దులు కార్తిక్, బాలగణేష్, అచ్యుత్, సాయితేజ, శివలు గాయపడ్డారు. నల్గొండలోని చైతన్య కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేందుకు బయలుదేరిన వీరు శంషాబాద్ పెద్దగోల్కొండ వద్దకు రాగానే ప్రమాదం బారిన పడ్డారు.
ఇవీ చూడండి: కారును వెనుక నుంచి డీసీఎం ఢీ.. అదుపుతప్పి వాగులో బోల్తా