రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు వస్తున్న ప్రైవేటు బస్సును... కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పల్టీలు కొట్టగా... దానిలో ఉన్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై అడ్డంగా పడిన కారును స్థానికులు పక్కకు తీసి... పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతి వేగంతో కారును నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: నిలిపి ఉంచిన బస్సులో అగ్ని ప్రమాదం