ETV Bharat / jagte-raho

డివైడర్​ను దాటి... గాల్లో ఎగిరి... బైక్​ను ఢీకొట్టింది - కారు బీభత్సం

అతివేగంతో దూసుకొచ్చిన కారు డివైడర్​ను దాటి అవతలి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన వెస్ట్​మారేడుపల్లిలో చోటు చేసుకుంది. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు.

car-accident-at west marredpally in hyderabad
డివైడర్​ను దాటి... గాల్లో ఎగిరి... బైక్​ను ఢీకొట్టింది
author img

By

Published : Oct 11, 2020, 7:06 PM IST

సికింద్రాబాద్​లోని వెస్ట్ మారేడ్​పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. మారేడ్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో నిఖిల్ అనే వ్యక్తి మద్యం సేవించి కారు నడిపాడు. అతి వేగంతో డివైడర్​ను ఢీకొట్టి పైకి ఎగిరి... అవతలి వైపు వెళ్తున్న బైక్​ను ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఇద్దరు కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారిని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.