నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో కారు ఢీకొని ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన జానిమియా ప్రమాదంలో మరణించాడు. మార్చాల నుంచి కల్వకుర్తిలో నివాసముంటున్న తన కూతురు వద్దకు పాలు తీసుకొస్తుండగా ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొంది.
ప్రమాదం చేసిన కారు కల్వకుర్తిలో లభించింది. కారు నడిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కల్వకుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.