ETV Bharat / jagte-raho

హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

author img

By

Published : Dec 5, 2020, 2:30 PM IST

Updated : Dec 5, 2020, 10:04 PM IST

Car crashes into hotel, two died in bada bheemgal
హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

14:28 December 05

హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

హోటళ్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

కారు డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘోరం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడాభీంగల్​లో చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న హోటల్​లోకి దూసుకెళ్లింది. హోటల్​లో కూర్చున్న పుప్పాల చిన్న రాజన్న(70) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వేల్పూర్​కు చెందిన భూమన్న(48) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బడాభీంగల్‌కు చెందిన భూదేవి(70) చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.  

భూమన్న తన ఇద్దరు కుమారులతో కలిసి భీంగల్ మండలం చేంగల్ నుంచి బడా భీంగల్ వైపు వెళ్తుండగా... అదే మార్గంలో వచ్చిన కారు వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు త్రుటిలో తప్పించుకున్నారు. వాహనం దూసుకొచ్చే కొన్ని క్షణాల ముందే పక్కకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు చిన్నారులు ప్రత్యక్షంగా చూడటం సీసీటీవీలో రికార్డు అయ్యింది.

ప్రమాద ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆర్మూర్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంతో మంత్రి మాట్లాడారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: నేను చనిపోతున్నా.. వెతకొద్దు నాన్నా...

Last Updated : Dec 5, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.