ETV Bharat / jagte-raho

అతివేగంతో డివైడర్​ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి

హైదరాబాద్​ నుంచి వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండకు వెళ్తున్న కారు... కాజీపేట ఫాతిమా వంతెన ఎక్కుతుండగా అదుపుతప్పి డివైడర్​ను ఢీకొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

one died in road accident at warangal fatima bridge
అతివేగంతో డివైడర్​ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
author img

By

Published : Oct 9, 2020, 10:08 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట-ఫాతిమా వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ నుంచి హన్మకొండకు అతివేగంగా వస్తున్న కారు.. వంతెన ఎక్కుతుండగా అదుపుతప్పి ఫుట్​పాత్​ పట్టీలకు బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న వడ్డేపల్లికి చెందిన రోహిత్​ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు.

కారులో పక్కనే కూర్చున్న మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. కాజీపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

ఇదీ చదవండిః మద్యం మత్తులో కారు నడపగా ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.