సూర్యాపేట జిల్లాలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం స్టేజి వద్ద శుక్రవారం సాయంత్రం కటకం వెంకన్న అనే వ్యక్తి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
తుంగతుర్తి నుంచి మద్దిరాల వైపు అతి వేగంతో వస్తున్న కారు ఢీకొనడంతో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం ఆయనని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి