ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి, యానాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు.. విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాదరావు, విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మి, వారి కుమారుడిగా గుర్తించారు.
వీరంతా.. కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. కొత్త కారు కొనుగోలు చేసి యానాం వెళ్తుండగా ఘటన జరిగిందన్నారు. మృతదేహాలను తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు మృతి