హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీచౌకి బ్రిడ్జి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఘటనలో కారులోని యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న గోల్కొండ పోలీసులు కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.