హైదరాబాద్‌లో గంజాయి దందా మళ్లీ ఊపందుకుంది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేశ్ లాడ్జ్ ఎదురుగా గంజాయి అమ్ముతున్నారనే కచ్చితమైన సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెక్కీ నిర్వహించారు. 54 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఏ1 నిందితుడు శివ జేసీబీ డ్రైవర్‌గా పని చేసేవాడు. అయితే వచ్చే డబ్బు కుటుంబ పోషణకు సరిపోక.. విశాఖపట్నం నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుల సహాయంతో విశాఖలో రూ. 5 వేలకు రెండు కేజీలు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో రూ. 10 నుంచి 12 వేలకు అమ్మేవాడు.
ఈ క్రమంలోనే మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు రెక్కీ నిర్వహించి.. ఐదుగురిని పట్టుకున్నారు. ఒక ఆటో, రూ. 25 వేల నగదు, 7 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్లో నిందితులను అప్పగించారు.
ఇదీ చదవండి: ఆ కేఫ్‌లో గంజాయి కలిపిన బీరుకు సూపర్ క్రేజ్!