ETV Bharat / jagte-raho

రాంప్రసాద్ హత్య కేసులో మరో ఇద్దరి విచారణ - ramprasad murder case

విజయవాడ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో విచారణ వేగంగా సాగుతోంది. హత్యకు రూపొందించిన కార్యాచరణలో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ramprasad
author img

By

Published : Jul 12, 2019, 12:57 PM IST

రాంప్రసాద్ హత్య కేసులో ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పంజాగుట్ట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆనంద్, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని గురువారం విచారించారు. రాంప్రసాద్​ను హత్య చేసేందుకు రూపొందించిన కార్యాచరణలో వీరిద్దరూ పాల్గొన్నారన్న అనుమానంతో వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు పంజాగుట్టలోని రాంప్రసాద్ కార్యాలయానికి సమీపంలో ఒక గది తీసుకుని రెండు నెలల నుంచి ఉంటున్నారని పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అతను రాంప్రసాద్‌కు అనుమానం రాకుండా కదలికలను గమనించి శ్యామ్‌కు చెప్పేవాడని విచారణలో తెలిసినట్లు సమాచారం. హత్యకు ముందు పదిరోజుల నుంచి రాంప్రసాద్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలను గంటగంటకూ శ్యామ్ బృందానికి చేరవేసేవాడని పోలీసులు తెలుసుకున్నారు. సుపారీ తీసుకున్న బృందంలో ఈ ఇద్దరూ ఉన్నారా.. లేదా అన్న అంశాలపై పరిశోధిస్తున్నారు.

ఇదీ చూడండి: పన్ను ఎగవేత వ్యాపారులపై వాణిజ్య పన్నుల శాఖ కొరడా

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.