సికింద్రాబాద్ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తేజస్వినీ ఆర్కేడ్ అపార్టుమెంట్లో ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వ్యాపారి విక్రమ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: 10 మందిని బలితీసుకున్న రహదారులు