సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దిల్సుఖ్నగర్ నుంచి వస్తున్న ఈ బస్సు వెనుక భాగంలో దట్టమైన పొగలు వచ్చాయి. స్థానికులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేసి బస్సు ఆపి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ప్రమాదాన్ని నిలువరించారు.
ఇవీ చూడండి: గుండ్లపోచంపల్లిలోని ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం