ETV Bharat / jagte-raho

దారుణం: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య - mulugu latest news

ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తికోయ గూడెంలో దారుణం జరిగింది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు.

దారుణం: మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

author img

By

Published : Jul 27, 2020, 9:35 PM IST

చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తి కోయ గూడెంలో జరిగింది. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం దంతేవాడ జిల్లా ఇంబీమ్​కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేశారు.

అసలు ఏమైందంటే...

జలగలంచగూడెంకు చెందిన కురసం భద్రయ్య ఇంటికి ఛత్తీస్​గఢ్​కు చెందిన అర్జున్​ అప్పుడప్పుడు వచ్చేవాడు. అతడికి చేతబడి వచ్చని... అందువల్లనే పలు సమస్యలు వచ్చాయని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భద్రయ్యతో చెప్పాడు. దాన్ని మనసులో పెట్టుకున్న భద్రయ్య ఈనెల 26న ఇంటికి వచ్చిన అర్జున్​కు మద్యం తాపించి మద్యం మత్తులో ఉండగా మరో వ్యక్తితో కలిసి గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని... మృతదేహాన్ని ఏటూరునాగారం మార్చురీకి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.