మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గిర్నితండాలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మెడను నరికి మొండెం అక్కడే ఉంచి... తలను బస్తాలో మూట కట్టి అర కిలోమీటర్ దూరంలోని ఖాళీ ప్రదేశంలో పడేశారు.
మృతుడు రైల్వే స్టేషన్‌లో పూలు అమ్ముకుంటూ.. పాత ఇనుప సామాను ఏరుకుని విక్రయిస్తూ జీవనం సాగించే వెంకన్నగా గుర్తించారు. ఖాళీ స్థలం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదాస్పద స్థలంలో మొండెం లభ్యం కావడంతో ఎదుటి వ్యక్తిని భయబ్రాంతులకు గురి చేసేందుకు మరో వ్యక్తి ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు
ఇదీ చూడండి: 'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'