ఏడేళ్లు గడిచినా.. ఆ అన్నలకు వారి తోబుట్టువుపై కోపం చల్లారలేదు... తమను కాదని ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన చెల్లిపై కోపం పెంచుకున్నారు. ఇదేమీ తెలియని ఆ చెల్లి.. అన్నలపై ప్రేమతో రాఖీ కట్టేందుకు వచ్చింది. అంతే చెల్లి అని చూడకుండా చితకబాదారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.
వీవర్స్ కాలనీకి చెందిన భారతి.. ఏడేళ్ల క్రితం అన్నలను కాదనుకొని.. ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. తిరిగి రాఖీ పండుగ సందర్భంగా అన్నలకు రక్షాబంధన్ కట్టేందుకు వచ్చింది. ఏడేళ్లు గడిచినా.. చెల్లిపై కోపం తగ్గకపోగా.. ఆమె రాఖీ కట్టడానికి వచ్చిందని దాడి చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిని భారతి.. భర్త సహాయంతో అక్కడ నుంచి బయటపడి.. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హిందూపురం గ్రామీణ మండలం పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్