ETV Bharat / jagte-raho

మరణంలోనూ వీడని బంధం: రోడ్డుప్రమాదంలో అక్కాతమ్ముళ్ల మృతి - వరంగల్​ గ్రామీణ జిల్లా నేర వార్తలు

పది నిమిషాల్లో ఇల్లు చేరాల్సిన అక్కాతమ్ముళ్లను మృత్యువు కబళించింది. ట్రాక్టర్ రూపంలో వారి ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.

brother and sister died in a road accident in warangal
మరణంలోనూ వీడని బంధం: రోడ్డుప్రమాదంలో అక్కాతమ్ముళ్ల మృతి
author img

By

Published : Sep 15, 2020, 9:57 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారు ఉప్పారపెళ్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్​పై వెళ్తున్న అక్కాతమ్ముళ్లను ట్రాక్టర్​ ఢీకొట్టింది. ఘటనలో అక్క అక్కడికక్కకే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులది పర్వతగిరి మండలం గోపన్నపల్లి గ్రామంగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కా తమ్ముడు మృతి చెందటం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీచూడండి.. దొంగ అనుకొని కొ‌ట్టాడు.. ప్రాణం తీశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.