ETV Bharat / jagte-raho

'ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తానన్న ప్రియుడు' - న్యాయం చేయాలని ఓ ప్రియురాలు నిరసన

ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తానని ఓ ప్రియుడు బెదిరించాడు. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు కాదన్నాడని ప్రియురాలు మౌనదీక్షకు దిగింది. ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టి న్యాయం చేయాలని వాపోయింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Boyfriend cheat young woman at tekumatla
'ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తాన్న ప్రియుడు'
author img

By

Published : Sep 27, 2020, 4:39 PM IST

'ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తాన్న ప్రియుడు'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో తనకు న్యాయం చేయాలని ఓ ప్రియురాలు నిరసనకు దిగింది. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియురాలిని ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడో ప్రేమికుడు. ఈ నేపథ్యంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్షకు దిగింది.

వివరాల్లోకి వెళితే టేకుమట్లకు చెందిన కొలుగూరి కార్తీక్ ఆర్మీ జవాన్. రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన తమ బంధువైన ఓ యువతిని గత ఆరేళ్లుగా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ యువతి పెళ్లి చేసుకోమని అడగగా ముఖం చాటేశాడు.

ఫోన్​లో సంప్రదిస్తే 'నేను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టును, ఎన్‌కౌంటర్ చేస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరిస్తున్నాడని యువతి వాపోయింది. కార్తీక్​తో తన పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతి తెలిపింది. చివరకు కుటుంబ సభ్యులతో కలసి టేకుమట్ల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ప్రియురాలు, తల్లి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : వద్దన్నా వినలేదు... వాగు దాటబోయి విగతజీవిగా మారాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.