ఉరితాడుకు వేలాడుతూ 11 ఏళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటుచేసుకుంది. పట్టణంలోని అల్లీపూర్కు చెందిన వీరేశం, లక్ష్మీ దంపతుల కుమారుడు వంశీ రేకుల ఇంట్లో పైకప్పుకు ఉరి వేసుకుని మృతి చెందడంతో తండ్రి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలాన్ని జహీరాబాద్ ఎస్ఐ వెంకటేశ్ సందర్శించారు. బాలుడు సొంతంగా ఉరివేసుకున్నాడా.. ఎవరైనా ఉరి వేసి ఉంటారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్తు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పతంగుల దుకాణంపై దాడులు.. చైనా మాంజా స్వాధీనం