ETV Bharat / jagte-raho

పశువులను మేపేందుకు వెళ్లి...విద్యుదాఘాతానికి బాలుడు బలి

పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పొలాలకు రక్షణగా అమర్చిన విద్యుత్​ తీగలు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మెదక్​ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

boy died with electric shock in medak dist
పశువులను మేపేందుకు వెళ్లి...విద్యుదాఘాతానికి బాలుడు బలి
author img

By

Published : Dec 15, 2020, 7:45 PM IST

Updated : Dec 15, 2020, 8:47 PM IST

మెదక్​ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. గ్రామానికి చెందిన సిద్ధిరాములు, సునీత దంపతుల ఏకైక కుమారుడు ప్రకాశ్​(15) మరణించాడు.

అడవి పందుల బారినుంచి వరినారును కాపాడేందుకు అమర్చిన విద్యుత్​ తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహన్ని మెదక్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి:బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు

Last Updated : Dec 15, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.