ETV Bharat / jagte-raho

బాలుడిని మింగేసిన సంపు.. తల్లిదండ్రుల అనుమానం - boy death in sump sangareddy dist

ఇంటిముందు సంతోషంగా ఆడుకుంటున్న బాలుడు అంతలోనే అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఎంతవెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు సమీపంలోని సంపులో శవమై తేలాడు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​లో ఘటన జరిగింది.

boy death in sump in sangareddy district
బాలుడిని మింగేసిన సంపు.. మృతిపై తల్లిదండ్రుల అనుమానం
author img

By

Published : Dec 31, 2020, 2:59 PM IST

సరదాగా ఆడుకుంటున్న బాలుడిని సంపు రూపంలో మృత్యువు కాటేసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చి తీరని వేదనకు గురిచేసింది. బీహార్​కు చెందిన శంభు కర్వార్ కుటుంబం ఇరవై రోజుల క్రితమే వచ్చి సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఇస్నాపూర్ శివాలయం సమీపంలో నివాసముంటున్నారు. ​ ​

అతను ఓ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికునిగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల కుమారుడు హర్షకుమార్ కనిపించడం లేదని పటాన్​చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుని ఆచూకీ కోసం వెతకగా ఇంటికి సమీపంలో ఉన్న ఓ సంపులో పడి బాలుడు చనిపోయినట్లు బుధవారం ఉదయం గుర్తించారు. సంపుపై మూత లేకపోవడం వల్లే ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.