వానరం తరమడం వల్ల కిందపడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంపత్-సంధ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రిషివర్ధన్(6) ఇంట్లో ఆడుకుంటుండగా కోతి వెంటపడింది. భయంతో పరిగెత్తుతూ కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు.
అప్పటి వరకు ఇంటి ముందే ఆడుకున్న తమ గారాల కుమారుడు కళ్లుమూసి తెరిచేలోపే విగత జీవిగా మారడం వల్ల ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుండి రక్షించాలని గ్రామస్థలు కోరారు.
ఇదీ చూడండి: చెట్లకు ఉరివేసుకుని స్నేహితుల ఆత్మహత్య