ETV Bharat / jagte-raho

బ్లేడ్​బ్యాచ్ వీరంగం: కారు ఆపిమరీ బ్లేడ్‌​తో కోసేశాడు! - తెలంగాణ తాజా వార్తలు

కారుకు అడ్డంగా ద్విచక్ర వాహనం వచ్చింది. చూసి బండి నడపండి అని కారులో ఉన్న యువకుడు చెప్పాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడికి ఆ మాట రుచించలేదు. గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ద్విచక్ర వాహనం నడిపిన యువకుడు... కారు నడిపిన యువకుడిపై బ్లేడుతో దాడి చేశాడు.

blade-batch-attack-at-pathlapadu-in-krishna-district-in-ap
బ్లేడ్​బ్యాచ్ వీరంగం: కారు ఆపిమరీ బ్రేడ్​తో కోసేశాడు!
author img

By

Published : Jan 4, 2021, 12:34 PM IST

Updated : Jan 4, 2021, 12:42 PM IST

ఓ యువకుడిపై మరో యువకుడు బ్లేడుతో ఛాతిపై దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పాతపాడు గ్రామంలో జరిగింది. పాతపాడుకి చెందిన పామర్తి భార్గవ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం తన పెద్దమ్మ కుమారుడు బెజవాడ సాయి, అతడి స్నేహితులు హర్ష, విజయ్​తో కలిసి కారులో పాతపాడు నుంచి విజయవాడకు బయల్దేరారు. వారు వెళ్తున్న కారుకు అడ్డంగా ద్విచక్రవాహనంపై మహ్మద్, రజాక్, లోకేష్ అనే యువకులు వచ్చారు. ప్రమాదం జరుగుతుందని గ్రహించిన కారులో ఉన్న సాయి... వాళ్లను వారించాడు.

చూసి నడపండని సాయి చెప్పిన మాటలు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురికి నచ్చలేదు. అంతే సాయితో ఆ యువకులు గొడవపడ్డారు. స్థానికులు అక్కడకు చేరి.. వారిని సముదాయించి అక్కడి నుంచి పంపేశారు.

జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న మహ్మద్, రజాక్, లోకేశ్​.. తమ స్నేహితులైన రాజ్​కుమార్, ఇబ్రహీం, అబ్బాస్, ఈశ్వర్​కుమార్​ను పిలిపించారు. పాతపాడు సెంటరుకు వచ్చి సాయి, హర్షతో మళ్లీ గొడవకు దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదైంది. ఆగ్రహంతో ఊగిపోయిన రజాక్​... భార్గవ్​ ఛాతిపై కోశాడు.

ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. మద్యం మత్తులోనే రజాక్, అతని స్నేహితులు గొడవ పడినట్లు తెలుస్తోంది. రజాక్ సింగ్​నగర్ ప్రాంతానికి చెందిన వాడనీ... అతనికి గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి: వేర్వేరు తనిఖీల్లో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

Last Updated : Jan 4, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.