సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన భాజపా నాయకుల అరెస్ట్ ప్రక్రియ కొనసాగుతోంది. గన్ పార్క్, నాంపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయం, బషీర్ బాగ్లోని నిజాం కళాశాల వద్ద అసెంబ్లీ వైపు దూసుకువచ్చిన భాజపా నాయకులను... పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు. పోలీసులకు భాజపా శ్రేణులకు వాగ్వాదం జరగడంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: ఛలో అసెంబ్లీకి వెళ్లకుండా భాజపా నేతల అడ్డగింత.. అరెస్టు