హైదరాబాద్ నగర శివారు మియాపూర్ ఠాణా పరిధి మదీనాగూడలోని రిలయన్స్ డిజిటల్ షో రూంలో భారీ దొంగతనం జరిగింది. ఈ షోరూంలో సుమారు రూ. 40 లక్షల నుంచి 50లక్షల వరకు విలువైన సెల్ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దుకాణంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ రోజు ఉదయం షోరూంను తెరిచి లోపలికి వెళ్లే సరికి సెల్ఫోన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించిన సిబ్బంది.. యాజమాన్యానికి సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఏమైనా చోరీకి గురయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం కారణంగా ఇవాళ పండుగ అయిన్పటికీ షోరూం నిర్వాహకులు మూసివేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ జోనల్ వ్యవస్థ