ETV Bharat / jagte-raho

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్​

వరంగల్​ దాడి ఘటనలో గాయపడ్డ భాజపా కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు రాజాసింగ్‌ను ఘట్​కేసర్‌లో అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

raja singh
raja singh
author img

By

Published : Feb 1, 2021, 1:05 PM IST

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఘట్​కేసర్‌ వద్ద భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో ఆదివారం తెరాస-భాజపా కార్యకర్తలు దాడులు చేసుకోగా.. గాయపడ్డ కమలం కార్యకర్తలను పరామర్శించేందుకు రాజాసింగ్‌ బయల్దేరారు.

మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు రాజాసింగ్‌ను ఘట్​కేసర్‌లో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు టోల్‌ప్లాజా వద్ద నిఘాపెట్టారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే వరంగల్‌వైపు అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి : భాజపా కార్యాలయంపై తెరాస శ్రేణులు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.