ETV Bharat / jagte-raho

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సునీల్​ దత్ - సైబర్​ నేరాలు

సులభంగా డబ్బు సంపాదించడమే వృత్తిగా మార్చుకున్న సైబర్​ నేరగాళ్లు ఎరవేసి, నమ్మించి మోసం చేస్తారని, జిల్లా ప్రజలు అప్రమతంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్​దత్​  సూచించారు. ఆన్​లైన్​ యాప్స్​, అమ్మకాలు, డిస్కౌంట్ల పేరుతో మోసం చేస్తారని అలాంటి కాల్స్​, మెసేజ్​ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

Bhadradri Kothagudem SP Sunil Dutt Warns About Cyber Crimes
సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సునీల్​ దత్
author img

By

Published : Aug 25, 2020, 12:54 PM IST

టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని రోజురోజుకు సైబర్​ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, అమాయకులకు ఆశ చూపి ఆన్​లైన్​లో డబ్బులు దోచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​దత్​ అన్నారు. ఆన్​లైన్​లో పాత సామాగ్రి క్రయవిక్రయాల పేరుతో వచ్చే మెసేజ్​లు, యాప్స్​, కాల్స్​ నమ్మవద్దని సూచించారు.

జిల్లాలోని అశ్వాపురం మండలం చింతిర్యాల క్రాస్​రోడ్డుకు చెందిన ఓ వ్యక్తి ఆగష్టు 1న మొబైల్​ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకొని ఆన్​లైన్​లో డబ్బులు పంపించాడు. ఆ తర్వాత అతనికి మొబైల్​ రాలేదు. సదరు మోసగాళ్లకు ఫోన్​ చేసినా ఎత్తలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు భద్రాద్రి కొత్తగూడెం సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్పీ తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన కొత్తగూడెం పోలీసులు నిందితులను పట్టుకొని వారి నుంచి కొంతవరకు తిరిగి ఇప్పించామని, సమస్యను పరిష్కరించిన సీఐ అబ్బయ్య, కానిస్టేబుల్​ గోపిని ఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరీతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.