ఆర్థిక ఇబ్బందులతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన... మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అన్నోజిగూడలోని ఓ కాలనీకి చెందిన తుమ్మలసీతారామ దాస్... ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగి. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అదే కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వెళ్లి... ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. సీతారామదాస్కు ... ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారు. భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేసినట్టు సీఐ చంద్రబాబు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య - అన్నోజిగూడలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో... ఓ బ్యాంకు ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు, ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య పోలీసులకు తెలిపినట్టు సీఐ చంద్రబాబు వెల్లడించారు.