ETV Bharat / jagte-raho

కన్నబిడ్డ మృతదేహాన్ని కాలువలో పడేసిన తండ్రి

ఓ ఆడ శిశువు బయటి ప్రపంచంలోకి రాకముందే.. తల్లి కడుపులోనే కన్నుమూసింది. కన్న బిడ్డకు అంత్యక్రియలు చేయాల్సిన తండ్రి.. దారుణంగా వ్యవహరించాడు. కరోనా భయంతోనో.. మరే ఇతర కారణంతోనో... ఊరి పెద్దలు చెప్పిన మాటలు విని.. ఏ తండ్రి చేయని విధంగా ప్రవర్తించాడు.

కన్నబిడ్డ మృతదేహాన్ని కాలువలో పడేసిన తండ్రి
కన్నబిడ్డ మృతదేహాన్ని కాలువలో పడేసిన తండ్రి
author img

By

Published : Jul 18, 2020, 5:11 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన మాదార్ బీ అనే మహిళ కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రసవ సమయంలో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. వైద్యులు బయటకు తీశారు. ఆసుపత్రి నుంచి శిశువు మృతదేహాన్ని తండ్రి షావలి తీసుకెళ్లాడు. ఊరికి వెళ్తూ.. వెళ్తూ.. మార్గ మధ్యలో చాబోలు వద్ద కేజీ కాలువలో శిశివు మృతదేహాన్ని పడేసి వెళ్లాడు.

స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువు చేతికి ఉన్న ట్యాగ్ ఆధారంగా... తండ్రి షావలిని పిలిపించారు పోలీసులు. ఎందుకిలా చేశావంటూ.. ప్రశ్నించారు. మృతదేహాన్ని అప్పగించారు. మృతిచెందిన శిశువు మృతదేహాన్ని గ్రామానికి తేవద్దని ఊరి పెద్దలు చెప్పారని షావలి చెప్పాడు. ప్రసవ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు పేర్కొన్నాడు.

ఇవీ చూడండి: కరోనా సోకిందని తీసుకెళ్లారు... ఓ టాబ్లెట్​ ఇచ్చి ఇంటికి పంపేశారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.