సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డులో ట్రాలీ ఆటో బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఆటో డివైడర్ను ఢీకొని అదుపుతప్పి తలకిందులుగా పడిపోయింది.
వర్షానికి దారి కనిపించక...
తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో రహదారి కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్లను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.