మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన బొప్పటి భారతమ్మ అనే మహిళ హైదరాబాద్‌లో ఉంటున్న ఆడబిడ్డ కుమార్తె వివాహ వేడుకకు శనివారం బయలుదేరారు. నవాబ్‌పేట నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ఆటోను కాకర్లపహాడ్ గ్రామ స్టేజీ దగ్గర ఎక్కారు. ఆమె ఎక్కిన 5 నిమిషాలకే ఆటో మైసమ్మ ఆలయం సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ దుర్ఘటనలో భారతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వివాహ వేడుకకు బయలుదేరిన మహిళ.. మృత్యువాత పడటం వల్ల కుటుంబంలో విషాదం అలుముకొంది. భారతమ్మ కుమారుడు రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ఇదీచూడండి: పనిచేసే దుకాణానికే కన్నం వేసి జైలుపాలైన ప్రబుద్ధుడు