పొట్టకూటి కోసం వెళ్తుంటే అనుకోని ప్రమాదంలో వ్యవసాయ కూలీలు గాయాలపాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యరం పరిధిలోని ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు ఏడో మైలు తండాకు వ్యవసాయ పనుల కోసం ఆటోలో బయలుదేరారు. ఇల్లందు శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగి గాయపడ్డారు. ఎదురుగా వచ్చిన కోతిని తప్పించబోయి ఆటో అదుపుతప్పింది.
డ్రైవర్‌తో సహా తొమ్మిది మంది మహిళలు గాయాల పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.
ఇదీ చదవండి: తటాకం ఉగ్రరూపం.. వెంచర్లను ముంచిన రావిర్యాల పెద్దచెరువు