ETV Bharat / jagte-raho

మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి వృద్ధుడి యత్నం - మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి యత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. జిల్లాలోని మోత్కూరు పురపాలికలో ఈ సంఘటన జరిగింది.

An old man who attempted sexual assault
లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడు
author img

By

Published : Jan 7, 2021, 5:03 PM IST

మానసిక వికలాంగురాలిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అదే కాలనీకి చెందిన అన్నపు భిక్షం అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వృద్ధునికి కోడలైన మమత అతనికి సహకరించింది. మానసిక వికలాంగురాలిని తన ఇంటికి పిలిచి తలుపు వేసింది. అప్పటికే ఇంట్లో ఉన్న భిక్షం యువతిపై అత్యాచారయత్నం చేశాడు. భయంతో ఆ యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే ఆ వృద్ధుడు పారిపోయాడు. బాధితురాలు తన తల్లితో కలిసి భిక్షం, అతని కోడలు మమతపై ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. నిందితులను అరెస్ట్​ చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చూడండి: తాగిన మైకంలో ఓ వ్యక్తి వీరంగం... కట్టేసి కొట్టిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.