మఠంపల్లి మండలం పెద్దవీడు రెవెన్యూ పరిధిలోని 540 సర్వే నెంబర్ భూమిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పునరావాస భూమిలో పనిచేసుకుంటున్న తనపై... ఓ పారిశ్రామికవేత్తకు చెందిన వ్యక్తులు.. ఇనుపరాడ్లతో దాడి చేశారని బాధితుడు మొత్యానాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని.. వాటిని మరవక ముందే దాడులు పునరావృతమవుతున్నాయని స్థానికులు తెలిపారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రెండు ద్విచక్రవాహనలు ఢీ.. ఇద్దరు మృతి