సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మట్టయ్య శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసం బయటకు రాగా.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు మట్టయ్యపై కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
దాడిలో మట్టయ్య ఎడమ చేతిపై స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కోదాడ డీఎస్పీ రఘు, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.. సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ