ETV Bharat / jagte-raho

ఏటీఎం మిషన్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో 5 రోజుల క్రితం ఏటీఎం మిషన్‌ చోరీ కేసులో నలుగురిని గజ్వేల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల 70 వేలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ATM mission theft case solved by Gajwel police
ఏటీఎం మిషన్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు
author img

By

Published : Jul 4, 2020, 5:08 AM IST

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో 5 రోజుల క్రితం ఏటీఎం మిషన్‌ చోరీ కేసులో నలుగురిని గజ్వేల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల 70 వేలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో ఆటోలో చోరీలకు పాల్పడే పరికరాలు ఉండడం వల్ల వారిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. మెుదట మేడ్చల్ జిల్లా మురహరిపల్లి వద్ద తర్వాత సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద చోరీకి యత్నించి విఫలమయ్యారని గజ్వేల్‌ ఏసీపీ తెలిపారు. ప్రజ్ఞాపూర్‌ ఏటీఎంలోని సీసీ కెమెరా కనెక్షన్‌ను తొలగించి... మరుసటి రోజు మిషన్‌ను గౌరారం అటవీ ప్రాంతానికి వెళ్లి పగులగొట్టారు. అందులో ఉన్న రూ. 4 లక్షల 98 వేలను నలుగురు పంచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.