హైదరాబాద్ అంబర్‌పేట పీఎస్ పరిధిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన మనోహర్ 6 నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి మీర్‌పేటలో నివాసముంటున్నాడు.
అక్రమ సంపాదనే లక్ష్యం..
నెలవారీ ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడం వల్ల అక్రమ సంపాదననే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తమ రాష్ట్రానికే చెందిన మనోజ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించటం మొదలుపెట్టారు.
అలా వ్యవహారం బయటపడింది..
పాలిటెక్నిక్ బస్టాప్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు యత్నించిన మనోహర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వ్యవహారం బయటపడింది. అనంతరం నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.