గంజాయి నుంచి తీసిన ఆసీస్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. చింతల్‌కు చెందిన సాయిగిరీశ్(21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం, షేక్ సోయల్(21) డిప్లొమా చదువుతున్నారు. గతంలో భద్రాచలంలో గంజాయి కేసులో అరెస్టైన గిరీశ్ పద్ధతి మార్చుకోకుండా స్నేహితుడు సోయల్ సాయంతో ఆసీస్ ఆయిల్ విక్రయిస్తున్నాడు.
విశాఖపట్నం నుంచి తీసుకువచ్చి, పద్మానగర్ ఫేజ్-2లో రాత్రి సమయాల్లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం, 240 గ్రాముల నూనె స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.