ETV Bharat / offbeat

ఎప్పుడూ ఎగ్ బుర్జీనే కాదు - ఓసారి ఇలా "వెజ్ ఆమ్లెట్ బుర్జీ" చేసుకోండి! - టేస్ట్ అద్దిరిపోతుంది! - VEG BHURJI RECIPE

వెజ్ ప్రియుల కోసం సూపర్ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

HOW TO MAKE VEG BHURJI
Veg Bhurji Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Veg Bhurji Recipe in Telugu : మనలో చాలా మంది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఎగ్ బుర్జీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఎగ్ బుర్జీ తినాలన్నా బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అందుకే మీకోసం ఒక అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే.. ఆహా అనిపించే 'వెజ్ ఆమ్లెట్ బుర్జీ' కర్రీ. రుచిలో ఎగ్ బుర్జీ కంటే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ! పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • వంటసోడా - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - తగినంత
  • జీలకర్ర - అరటీస్పూన్
  • అల్లం తరుగు - అరటీస్పూన్
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • సన్నని ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 4
  • టమాటాలు - 2
  • పసుపు - పావుటీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • గరం మసాలా - పావుటీస్పూన్
  • మిరియాల పొడి - పావుటీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం - కొంచం

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, వంటసోడా, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండి కంటే కాస్త జారుగా ఉండేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై ఒక పాన్ పెట్టుకొని 4 టేబుల్​స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆ తర్వాత అల్లం తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు వేసి ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • ఆపై పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి, గరంమసాలా, మిరియాల పొడి వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి టమాటాలు సాఫ్ట్​గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • టమాటాలు ఉడికి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దిబ్బరొట్టె మాదిరిగా పాన్ మొత్తం పోసేయాలి.
  • ఆ తర్వాత అంచుల వెంట, పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి.. సన్నని మంట మీద శనగపిండిని ఉడకనివ్వాలి.
  • 5 నిమిషాల తర్వాత పిండిపైన గరిటెతో అక్కడక్కడా చిన్న హోల్స్​ చేసుకోండి. ఇలా చేస్తే పిండి లోపల కూడా చాలా చక్కగా ఉడుకుతుంది.
  • ఆ తర్వాత మరోసారి పాన్​పై మూతపెట్టి మీడియం ఫ్లేమ్​ మీదనే శనగపిండి మీద పగుళ్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • అప్పుడు పిండి ముద్దను అట్ల కాడతో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి.
  • అనంతరం మంటను కాస్త పెంచి పిండిలో చెమ్మ ఆరిపోయి క్రిస్పీగా మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • ఇక స్టౌ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని, కొత్తిమీర తరుగు చల్లుకుని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే వెజ్ బుర్జీ రెడీ!
  • దీన్ని వేడివేడిగా అన్నం, చపాతీ ఇలా దేనిలోకి తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ వెజ్ బుర్జీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు!

ఇవీ చదవండి :

ఆరోగ్యాన్నిచ్చే టేస్టీ "పాలక్ సోయా బుర్జీ" - సింపుల్​గా ఇలా ప్రిపేర్​ చేసుకోండి! - టేస్ట్ కేక!

క్యాబేజీ ఇంట్లో ఎవ్వరూ తినట్లేదా? - ఇలా "క్యాబేజీ ఎగ్​ బుర్జీ" చేయండి! - టేస్ట్​ అదుర్స్​ అంతే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.