సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గాపురం స్టేజీ వద్ద కోదాడ పట్టణం నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1.50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కోదాడ పట్టణంలోని ఓ వైన్స్లో మద్యం కొనుగోలు చేసి.. వేరుశనగల తరలింపు ముసుగులో.. వేరుశనగల కింద మద్యం బాటిళ్లను దాచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రెండు ఆటోలను సీజ్ చేసి.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అనంతగిరి ఎస్సై రామాంజనేయులు తెలిపారు.