ఆర్మీ జవాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. వరంగల్ అర్బన్ జిల్లా శివ నగర్‌కు చెందిన మురళి బాబు అనే జవాన్.. అదే ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతని భార్య అమరావతి గుర్తించింది. రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగించింది.
కొన్ని సంవత్సరాలుగా తనతో పాటు కూతుర్నీ పట్టించుకోవడం లేదని పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లైన కొన్ని రోజుల నుంచే తన మేనకోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. తమ సమస్యను గతంలో ఇరువురు పెద్దమనుషుల సమక్షంలో పరిష్కారం చేసినప్పటికీ మురళి ప్రవర్తన మారలేదని భార్య అమరావతి తెలిపింది. తనకు తన భర్త కావాలని పోలీసులను వేడుకుంది. భారత రక్షణ రంగంలో పనిచేస్తూ ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు పట్టుబడటం నగరవాసులను తీవ్రంగా కలచివేసింది.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం